డకౌట్లతో ఆర్యభట్టకు నివాళి అర్పించా


Tue,August 13, 2019 01:54 AM

Sehwag
న్యూఢిల్లీ : సామాజిక మాధ్యమాల్లో సెహ్వాగ్ విభిన్న పోస్టులు పెడుతుంటాడు. సందర్భోచితంగా సరదాగా, చతురతతో మాజీ డాషింగ్ ఓపెనర్ చేసే ట్వీట్లకు అభిమానులు ఫిదా అయిపోతుంటారు. అయితే, తనపై తానే సెటైర్ వేసుకుంటూ సెహ్వాగ్ సోమవారం ఓ ట్వీట్ చేశాడు. 2011 ఇంగ్లండ్ పర్యటనలో ఓ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌట్ అయిన తరుణానికి ఎనిదేండ్లయిన సందర్భంగా వీరూ ఈ ట్వీట్ చేశాడు. సరిగ్గా ఎనిమిదేండ్ల క్రితం ఇదే రోజు బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యా. రెండు రోజుల ప్రయాణం... 188 ఓవర్ల ఫీల్డింగ్ తర్వాత ఇలా జరిగింది. అయిష్టంగానే అప్పుడు ఆర్యభట్టకు నివాళి అర్పించా అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. దీనికి అభిమానులు అనేక రకాల కామెంట్లు చేశారు. వైఫల్యాలను గుర్తు తెచ్చేందుకు ఎంతో ధైర్యం కావాలని, అది సెహ్వాగ్ ఉందంటూ కొందరు ప్రశంసించారు. తాను సెలెక్టర్ కావాలనుకుంటున్నానని, ఎవరు అవకాశమిస్తారంటూ మరో ట్వీట్ కూడా వీరూ చేశాడు. 2011లో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌ను భారత్ 0-4తో కోల్పోయిన విషయం తెలిసిందే.

511

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles