పంకజ్‌దే జాతీయ స్నూకర్ టైటిల్


Mon,February 11, 2019 02:00 AM

ఇండోర్: భారత స్టార్ క్యూయిస్టు పంకజ్ అద్వానీ తనకు తిరుగులేదని చాటిచెప్పాడు. సీనియర్ జాతీయ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో అద్వానీ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో అద్వానీ 6-0 తేడాతో లక్ష్మణ్ రావత్‌పై అలవోక విజయం సాధించాడు. ఆది నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ పంకజ్ పాయింట్లు కొల్లగొట్టాడు. దీని ద్వారా తొమ్మిదో జాతీయ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్న పంకజ్‌కు ఇది 32వ స్వర్ణం కావడం విశేషం. మహిళల ఫైనల్లో వర్షా సంజీవ్ 4-2తో అరంటా సాంచీస్(మహారాష్ట్ర)పై విజయంతో టైటిల్ దక్కించుకుంది.

300

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles