ఏటీపీ టైటిల్ దిమిత్రోవ్‌దే..


Tue,November 21, 2017 02:16 AM

Dimitrov
లండన్: ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ ట్రోఫీని బల్గేరియా ఆటగాడు గ్రిగర్ దిమిత్రోవ్ కైవసం చేసుకున్నాడు. తొ లిసారిగా ఈ టోర్నీకి అర్హత సాధించిన దిమిత్రోవ్ తనదైన ఆటతీరుతో ఏడో సీడ్ డేవిడ్ గాఫిన్‌పై పోరాడి గెలిచాడు. రెండున్నర గంటలపాటు సాగిన ఉత్కంఠ పోరులో దిమిత్రోవ్ 7-5, 4-6, 6-3 తేడాతో గాఫిన్‌ను చిత్తుచేశాడు. దిమిత్రోవ్ అర్హత దక్కించుకున్న అయిన లిసారే ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్‌ను గెలిచి రికార్డుల్లోకెక్కాడు. 1998లో అలెక్స్ కొరెట్జా తర్వాత ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు. మరోవైపు రన్నరప్ గాఫిన్ కూడా అర్హత సాధించిన తొలిసారే ఫైనల్‌కు చేరడం మరో విశేషం. అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న దిమిత్రోవ్ మూడో ర్యాంకుకు ఎగబాకాడు.

338

More News

VIRAL NEWS

Featured Articles