ఆ నిర్ణయం తప్పే


Mon,July 22, 2019 02:51 AM

dharmasena
కొలంబో: ప్రంపచకప్ ఫైనల్లో తప్పుడు నిర్ణయంతో వార్తల్లోకెక్కిన శ్రీలంక అంపైర్ కుమార ధర్మసేన తాను చేసింది పొరపాటే అని అంగీకరించాడు. న్యూజిలాండ్, ఇంగ్లం డ్ మధ్య ఉత్కంఠభరితంగా సాగిన తుదిపోరు ఫైనల్ ఓవర్‌లో గప్టిల్ త్రో వేయగా బంతి.. స్టోక్స్ బ్యాట్‌కు తాకి బౌండ్రీకి వెళ్లింది. దీనికి నిబంధనల ప్రకారం 5 పరుగులే ఇవ్వాల్సి ఉండగా.. అంపైర్ ధర్మసేన మాత్రం 6 పరగులు ఇచ్చాడు. దీంతో ఇంగ్లండ్ చివరకు మ్యాచ్‌ను టైగా ముగించింది. ఆ తర్వాత సూపర్ ఓవర్‌లోనూ స్కోర్లు సమమవడంతో మ్యాచ్‌లో ఎక్కువ బౌండ్రీలు కొట్టిన ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై ధర్మసేన స్పందిస్తూ.. టీవీ రీప్లేలు చూశాకే నా నిర్ణయం తప్పు అని అర్థమైంది. టీవీల్లో చూసిన తర్వాత దానిపై మాట్లాడటం సులువే. కానీ మైదానం మధ్యలో నిలబడి రీప్లే చూసే వెసులుబాటు మాకు ఉండదు. సకాలంలో నిర్ణయం తీసుకున్నందుకు ఐసీసీ నన్ను అభినందించింది కూడా. నిబంధనల ప్రకారం ఈ అంశంపై థర్డ్ అంపైర్‌ను సహాయం కోరే అవకాశం లేకపోవడం కూడా దెబ్బకొట్టింది అని అన్నాడు.

578

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles