టీఎస్‌డబ్ల్యూఆర్‌డీసీడబ్యూ ఓవరాల్ విజేత జగిత్యాల


Mon,February 11, 2019 02:20 AM

TSWRDCW
ఎంజీ యూనివర్సిటీ: బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు అన్నింటా రాణించాలనే ప్రత్యేక విజన్‌తో సీఎం కేసీఆర్ గురుకుల డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశారని రాష్ట్ర గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని చర్లపల్లి మహిళల గురుకులంలో మూడు రోజులుగా జరుగుతున్న తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీల (టీఎస్‌డబ్ల్యూఆర్‌డీసీడబ్ల్యూ) 3వ రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఆదివారం ముగిసింది. ఇందులో జగిత్యాల జట్టు ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను దక్కించుకుంది. ఓవరాల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ విజేతగా ఖమ్మం నిలిచింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రవీణ్‌కుమార్ మాట్లాడారు. విద్యను ఆర్జించినంత మాత్రాన అభివృద్ధి సాధ్యం కాదని, సమాజంపై అవగాహన అవసరమన్నారు. విద్యార్థుల అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో సౌత్‌జోన్ కోఆర్టినేటర్ నరేందర్‌రెడ్డి, సహాయ కార్యదర్శి ప్రవీణ్, నోడల్ అధికారి శేషుకుమారి, రామ్‌లక్ష్మణ్, నల్లగొండ , సూర్యాపేట ప్రిన్సిపాల్స్ జనార్దన్, వెంకటయ్య, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.

357

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles