
న్యూఢిల్లీ: న్యూజిలాండ్ స్పీడ్‌స్టర్ ట్రెంట్ బౌల్ట్ వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ముంబైకి అతడిని విక్రయించింది. ఈ మేరకు ఐపీఎల్ నిర్వాహకులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2014లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన బౌల్ట్ గత రెండు సీజన్లుగా ఢిల్లీ తరఫున ఆడుతున్నాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకు 33 మ్యాచ్‌లు ఆడిన ట్రెంట్ మొత్తం 38 వికెట్లు తీశాడు. మరోవైపు దేశవాళీ పేసర్ అంకిత్ రాజ్‌పుత్‌ను కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌కు విక్రయించింది. 2018 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఐదు వికెట్లు తీసి.. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన తొలి అన్క్యాప్డ్ ప్లేయర్‌గా రాజ్‌పుత్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.