ధవన్‌కు వైద్య పరీక్షలు


Tue,June 11, 2019 01:21 AM

Dhawan
నాటింగ్‌హామ్: ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో గాయపడ్డ భారత ఓపెనర్ శిఖర్ ధవన్‌కు మంగళవారం వైద్య పరీక్షలు జరుపనున్నారు. ఆసీస్‌తో ఆదివారం నాటి పోరులో ధవన్ ఎడమ చేతి బొటనవేలుకు గాయమైంది. స్పీడ్‌స్టర్ కౌల్టర్ నైల్ వేసిన బంతి వేలికి బలంగా తాకిం ది. అయినా నొప్పిని పంటి బిగువున భరించిన గబ్బర్ సూపర్ సెంచరీతో జట్టుకు భారీ స్కోరు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. వేలు ఉబ్బడంతో డగౌట్‌కే పరిమితమైన ధవన్ స్థానంలో జడేజా ఫీల్డింగ్ చేశాడు. అయితే గాయం తీవ్రత అంతగా లేదని ముందు జాగ్రత్తగా వైద్య పరీక్షలు చేయిస్తున్నామని జట్టు ఫిజియో ఫర్హత్ తెలిపాడు.

784

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles