మార్పులు.. చేర్పులు లేవు!


Fri,November 16, 2018 12:52 AM

-వన్డే జట్టుపై చీఫ్ కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యలు
ravi-kohli
ముంబై: ప్రపంచకప్ వరకు కేవలం 13 వన్డేలే ఆడాల్సి ఉండటంతో.. టీమ్‌ఇండియాలో మార్పులు చేర్పులు చేసే అవకాశం లేదని భారత్ జట్టు చీఫ్ కోచ్ రవిశాస్త్రి స్పష్టం చేశాడు. ఇప్పట్నించి ఆడబోయే 15 మంది ఆటగాళ్లే దాదాపుగా వరల్డ్‌కప్‌నకు వెళ్లే జట్టులో ఉంటారని సంకేతాలిచ్చా డు. వన్డే జట్టులో మార్పులు, చేర్పుల సమయం ముగిసిపోయింది. ఇప్పుడంతా ఉన్న వాళ్లలో నుంచి మెరుగైన తుది జట్టును ఎంపిక చేసుకోవడమే. ఇప్పుడు ఎంపిక చేసే 15 మంది జట్టే దాదాపుగా లండన్ విమానం ఎక్కుతుంది. ఆటపై దృష్టిపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పట్నించి సమిష్టిగా ఆడుతూ విజయాలబాట పట్టాలి. ఎక్కువగా గాయాలు కాకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ సమయంలో వేరే విషయాలను పట్టించుకోకుండా తుది జట్టు గురించే ఆలోచించాలి. ఎందుకంటే మాకు 13 మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. ఇందులో ఆడటం ద్వారా అత్యుత్తమైన జట్టేదో ఎంచు కోవాలి అని శాస్త్రి పేర్కొన్నాడు. టీమ్ ఇండియా ఆడే 13 మ్యాచ్‌ల్లో.. విదేశాల్లో ఆస్ట్రేలియాతో మూడు, న్యూజిలాండ్‌తో ఐదు ఉన్నాయి. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ సిరీస్‌ల నుంచి చాలా నేర్చుకున్నామన్నాడు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో మా పురోగతి చాలా బాగుంది. ఇంగ్లండ్‌లో సిరీస్ తేడాను పక్కనబెడితే వాస్తవ ప్రదర్శనలో మేం చాలా ముందున్నాం. విదేశీ గడ్డపై కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో అలా ఆడటమంటే మామూలు విషయం కాదు. ఓవరాల్‌గా మా ప్రదర్శనపై చాలా సంతృప్తిగా ఉన్నాం. గత పర్యటనల నుంచి ఆటగాళ్లు కూడా చాలా నేర్చుకున్నారు. క్రికెటర్లు నిరంతరం నేర్చుకుంటూనే ఉంటారు. ఇంగ్లండ్, సఫారీ పర్యటనల తప్పులను ఆసీస్‌లో చేయం. మంచి పోటీ క్రికెట్ ఆడుతాం. టెస్ట్ క్రికెట్ చాలా భిన్నంగా ఉంటుంది. వరల్డ్‌కప్‌నకు ముందు ఇది చివరి సిరీస్ కావడంతో గట్టిపోటీ ఇవ్వాలని భావిస్తున్నాం. కాబట్టి సిరీస్ మొత్తంపై మేం దృష్టిపెట్టాం అని ఈ మాజీ కెప్టెన్ వ్యాఖ్యానించాడు.

220
Tags

More News

VIRAL NEWS