దుర్యోధన్ ముందంజ


Sat,September 14, 2019 12:12 AM

boxing
ఎక్టరీన్‌బర్గ్(రష్యా): ప్రతిష్ఠాత్మక బాక్సింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ దుర్యోధన్‌సింగ్ నేగి ముందంజ వేశాడు. శుక్రవారం జరిగిన పురుషుల 69కిలోల బౌట్‌లో దుర్యోధన్ 4-1తో కోర్యున్ అస్టోయన్(అర్మేనియా)పై విజయం సాధించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. ప్రత్యర్థి తన కంటే బలమైన వాడు అయినా వెరువని ఆత్మవిశ్వాసం కనబరిచిన నేగి ఆది నుంచి తనదైన దూకుడు కనబరిచాడు. పవర్ పంచ్‌లు సంధించడంలో అర్మేనియా బాక్సర్ విఫలం కాగా..ఇదే అదునుగా విజృంభించిన దుర్యోధన్ కండ్లు చెదిరే పంచ్‌లతో విరుచుకుపడ్డాడు. భారత బాక్సర్ దాడిని తట్టుకోవడంలో విఫలమైన అస్టోయన్ ఆఖర్లో కొంత ప్రతిఘటించినా..లాభం లేకపోయింది. చివరికి రిఫరీలు దుర్యోధన్ వైపు నిలుస్తూ విజేతగా ప్రకటించారు. మరోవైపు మనీశ్ కౌశిక్(63కి), బ్రిజేశ్ యాదవ్(81కి) విజయాలతో రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు.

160

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles