తెలంగాణ బాలికల జట్టుకు టైటిల్


Thu,December 6, 2018 12:18 AM

local
హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: సౌత్ బాలుర, బాలికల అంతర్ రాష్ట్ర టోర్నీలో తెలంగాణ బాలికల జట్టు చాంపియన్ నిలిచింది. హైదరాబాద్, మర్రి లక్ష్మణరెడ్డి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ముగిసిన ఈ టోర్నీని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ సౌజన్యంతో రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఫైనల్లో బాలికల విభాగంలో తెలంగాణ జట్టు విజయం సాధించగా.. బాలురు విభాగంలో కర్నాటక జట్టు చాంపియన్ సాధించింది. ముగింపు కార్యక్రమానికి హాజరైన ఎంఎల్ సంస్థల చైర్మన్ మర్రి లక్ష్మణ్ విజేతలను అభినందించారు. భవిష్యత్ మరిన్న టోర్నీలు నిర్వహించేందుకు ముందుకు వస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

92

More News

VIRAL NEWS