జాతీయ ఫెన్సింగ్ పోటీలు ప్రారంభం


Thu,January 12, 2017 01:43 AM

rajendhar
కరీంనగర్ స్పోర్ట్స్, నమస్తే తెలంగాణ: రాష్ర్టాన్ని దేశంలోనే అత్యుత్తమ క్రీడానిలయంగా మారుస్తామని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం కరీంనగర్‌లో 62వ ఎస్‌జీఎఫ్ జాతీయస్థాయి బాలబాలికల ఫెన్సింగ్ పోటీలను మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ పోటీలకు 14 రాష్ర్టాలతో పాటు సీబీఎస్‌ఈ, విద్యాభారతి పాఠశాలలకు చెందిన దాదాపు 315 మంది క్రీడాకారులు, 60 మంది అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

376
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS