టైటాన్స్‌కు మూడో విజయం


Sun,August 25, 2019 01:39 AM

ఢిల్లీ: ఉత్కంఠ పోరులో ఒత్తిడిని జయించిన తెలుగు టైటాన్స్.. ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం ఇక్కడ జరిగిన పోరులో.. టైటాన్స్ 24-21తో జైపూర్ పింక్ పాంథర్స్‌పై విజయం సాధించింది. కూత కంటే పట్లతోనే రసపట్టుగా సాగిన పోరులో.. టైటాన్స్ డిఫెండర్లు అదరగొట్టారు. లీగ్‌లో భాగంగా 10 మ్యాచ్‌లాడిన టైటాన్స్ (23 పాయింట్లు) 3 విజయాలు, 5 పరాజయాలు, 2 డ్రాలతో పట్టికలో తొమ్మిదో స్థానానికి చేరింది. మరోవైపు టైటాన్స్ చేతిలో ఓడినా.. జైపూర్ 37 పాయింట్లతో అగ్రస్థానంలోనే ఉంది. టైటాన్స్ తరఫున విశాల్ భరద్వాజ్ (8 పాయింట్లు) ట్యాక్లింగ్ హైఫై సాధించగా.. స్టార్ రైడర్ సిద్ధార్థ్ దేశాయ్ (3 పాయింట్లు) పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. జైపూర్ తరఫున అగ్రశ్రేణి ప్లేయర్ దీపక్ హుడా (1 పాయింట్) విఫలం కావడం ఫలితంపై ప్రభావం చూపింది. సిద్ధార్థ్ ప్రత్యర్థి కోర్టులో నాలుగుసార్లు సూపర్ ట్యాకిల్ కాగా.. విశాల్ రెండు సూపర్ పట్లు పట్టి టైటాన్స్ విజయం దిశగా నడిపించాడు. మరో మ్యాచ్‌లో ఢిల్లీ 33-31తో బెంగళూరుపై గెలుపొందింది.

853

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles