హర్ష భరత్‌కోటి అదుర్స్


Wed,August 14, 2019 01:33 AM

Harsha
ఇరీనా వరాకోమ్‌స్క టైటిల్ కైవసం

సోవాల్కీ(పోలండ్): తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ హర్ష భరత్‌కోటి మరోసారి సత్తాచాటాడు. పోలండ్ వేదికగా జరిగిన ఇరీనా వరాకోమ్‌స్క మూడో అంతర్జాతీయ చెస్ స్మారక టోర్నీలో విజేతగా నిలిచాడు. మొత్తం 12 దేశాల నుంచి 322 మంది ఆటగాళ్లు పాల్గొన్న టోర్నీలో భరత్‌కోటి అసాధారణ ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. తొమ్మిది రౌండ్ల పాటు జరిగిన పోరులో ఏడు పాయింట్లు దక్కించుకున్న ఈ తెలంగాణ కుర్రాడు టాప్‌లో నిలిచాడు. థామస్ మార్కోవ్‌స్కీ(పోలండ్), వ్లాదిమిర్ జక్రస్తోవ్ (రష్యా) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. టోర్నీలో ఓటమి ఎరుగని ఈ యువ చెస్ క్రీడాకారుడు తన కెరీర్‌లో మరో టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఆది నుంచి తనదైన శైలి లో ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ భరత్‌కోటి ముందుకు సాగాడు. తొలి రౌండ్‌లో నాదియా షాపన్కో(ఉక్రెయిన్)తో పోరును డ్రా చేసుకున్న హర్ష.. మలి రౌండ్‌లో మే పావెల్(పోలండ్)ను ఓడించాడు. ఇదే గెలుపు జోరు కొనసాగిస్తూ ఆధిక్యాన్ని అంతకంతకు పెంచుకుంటూ పోయాడు. మొత్తంగా రూ.2 లక్షల (11వేల పీఎల్‌ఎన్, పోలండ్ కరెన్సీ) ప్రైజ్‌మనీ దక్కించుకున్నాడు.

232

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles