సెమీస్‌లో తెలంగాణ బాలుర జట్టు


Tue,February 13, 2018 01:42 AM

-ఎస్‌జీఎఫ్ హ్యాండ్‌బాల్ టోర్నీ
SGF
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్: ఎస్‌జీఎఫ్ అండర్-17 బాలబాలికల హ్యాండ్‌బాల్ టోర్నీలో తెలంగాణ బాలుర జట్టు సెమీస్ చేరగా..బాలికల జట్టు క్వార్టర్ ఫైనల్ చేరింది. సోమవారం బాలుర విభాగంలో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో తెలంగాణ బాలుర జట్టు యూపీపై 24-12 స్కోర్ తేడాతో గెలిచి సెమీస్‌కు చేరగా బాలికల విభాగంలో జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో తెలంగాణ బాలికల జట్టు గోవాపై 25-03 స్కోర్‌తో గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. బాలుర విభాగంలో జరగనున్న మొదటి సెమీఫైనల్ మ్యాచ్‌లో తెలంగాణ రాష్ట్ర జట్టు ఆంధ్రప్రదేశ్‌తో తలపడనుంది. మన బాలికల జట్టు మహారాష్ట్ర జట్టుతో క్వార్టర్స్‌లో తలపడనుంది.

331
Tags

More News

VIRAL NEWS