జాతీయ టెన్నికాయిట్ విజేత తెలంంగాణ


Wed,February 20, 2019 12:59 AM

Tennikoit
వికారాబాద్, నమస్తే తెలంగాణ : జాతీయ టెన్నికాయిట్ పోటీల్లో తెలంగాణ జట్టు ఓవరాల్ విజేతగా నిలిచింది. పోటీలకు ఆఖరి రోజైన మంగళవారం జరిగిన బాలికల ఫైనల్లో ఆంధ్రప్రదేశ్‌పై విజయంతో తెలంగాణ కప్‌ను కైవసం చేసుకుంది. బాలుర తుదిపోరులో మహారాష్ట్రపై తెలంగాణ విజయం సాధించింది. పోటీలలో 10 రాష్ర్టాలకు చెందిన దాదాపు 100 మంది పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా ఎస్పీ అన్నపూర్ణ విజేతలకు ట్రోఫీలు అందించారు. గొప్ప క్రీడాకారులుగా ఎదిగి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలని ఎస్పీ ఆకాంక్షించారు.

172

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles