అర్జున్‌కు రజతం


Mon,August 12, 2019 02:32 AM

chess
హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: వర్ధమాన చెస్‌ ఆటగాళ్లు మాస్టర్‌ ఆదిరెడ్డి అర్జున్‌, ఆకుల సుహాస్‌ జాతీయ అండర్‌-9 ఓపెన్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో పతకాలు కొల్లగొట్టారు. అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో అర్జున్‌ రజత పతకం సొంతం చేసుకోగా.. సుహాస్‌ కాంస్యం చేజిక్కించుకున్నాడు. 11 రౌండ్ల పాటు సాగిన ఈ పోటీల్లో తమిళనాడుకు చెందిన జి. ఆకాశ్‌ (9.5 పాయింట్లు) స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. అర్జున్‌ 9 పాయింట్లతో రెండో ప్లేస్‌లో నిలువగా.. సుహాస్‌ 8.5 పాయింట్లతో తృతీయ స్థానం దక్కించుకున్నాడు. కోచ్‌, గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌బీ రమేశ్‌ వద్ద శిక్షణ తీసుకుంటున్న అర్జున్‌ 8వ రౌండ్‌ వరకు అగ్రస్థానంలో ఉండి.. చివర్లో తడబడి రెండో ప్లేస్‌కు పరిమితమయ్యాడు.

277
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles