అంతర్జాతీయ కరాటే టోర్నీలో తేజాబాయ్‌కు రజతం


Tue,November 21, 2017 02:12 AM

teja-bhai
కల్వకుర్తి, నమస్తే తెలంగాణ: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థిని తేజాబాయ్ రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేసింది. సరైన ప్రోత్సాహామిస్తే అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటుతానని నిరూపించింది. సింగపూర్‌లో ఈనెల 18, 19 తేదీలల్లో జరిగిన అంతర్జాతీయ పెన్‌కాక్ సిలాట్ కరాటే చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో మెరిసింది. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరుస్తూ..ప్రత్యర్థులను మట్టికరిపించి ద్వితీయస్థానంలో నిలిచింది.

106

More News

VIRAL NEWS