జిగేల్ ఎవరిదో


Fri,July 6, 2018 03:52 AM

-ఫ్రాన్స్ X ఉరుగ్వే
-బ్రెజిల్ X బెల్జియం
-ఉత్కంఠ కలిగిస్తున్న క్వార్టర్స్ పోరు
-సెమీస్ చేరేందుకు జట్ల కసరత్తు
-ఫిఫా ప్రపంచకప్

neymar
కజాన్(రష్యా): ఫిపా ప్రపంచకప్‌లో మరో రొమాంచిత పోరు..హాట్ ఫేవరెట్ హోదాతో బరిలోకి దిగిన బ్రెజిల్ ఒకవైపు ..వరుస విజయాలతో .ఈ ప్రపంచకప్‌లో డార్క్‌హార్స్ ముద్రతో మరోవైపు బెల్జియం ముఖాముఖి పోరుకు రెడీ అయ్యాయి. ఇటు బ్రెజిల్ జట్టులో స్టార్ ైస్ట్రెకర్లు నెయ్‌మార్, కౌటినో, గాబ్రియెల్ జీసస్ లాంటి ైస్ట్రెకర్లు.. మార్సెలో, విలియన్ లాంటి మిడ్‌ఫీల్డర్లు..అంతకుమించిన పటిష్ఠమైన డిఫెండర్లతో అలరారుతున్నది..తడబాటుతో ఫిఫా ప్రపంచకప్ పోరు ఆరంభించినా..మ్యాచ్‌మ్యాచ్‌కూ రాటుదేలుతూ వరుస విజయాలతో మరింత ఊపుమీద కొనసాగుతున్నది. కాగా, మరోవైపు కెరీరర్‌లో అద్భుత ఫాంతో అలరిస్తున్న బెల్జియం జట్టు అద్భుతమైన మేళవింపుతో అసూయ కలిగిస్తున్నది. ప్రపంచకప్ అర్హత మ్యాచ్‌ల నుంచి అపజయం లేకుండా ప్రపంచకప్ క్వార్టర్స్‌కు దూసుకొచ్చిన బెల్జియం జట్టును తక్కువ అంచనావేస్తే బ్రెజిల్‌కు షాక్ తప్పదు. స్టార్ ప్లేయర్ డిబ్రుయెన్ స్ఫూర్తిగా..ైస్ట్రెకర్లు లుకాకు, హెర్నాండెజ్ చెలరేగుతున్న వేళ ప్రత్యర్థి జట్లు బోల్తా కొడుతున్నాయి. 2-0తో వెనుకబడి మరీ ప్రపంచకప్‌లో విజయం సాధించిన జట్టుగా రికార్డుల కెక్కిన బెల్జియం జట్టు అద్భుతమైన పోరాటపటిమతో ప్రపంచకప్‌లో ఫేవరెట్‌గా కితాబందుకుంటున్నది.. క్వార్టర్స్‌లో బెల్జియం జట్టు విజయం సాధించాలంటే బ్రెజిల్‌పై అసాధారణంగా రాణించాల్సిందే.. విజయం సాధించడంలో మాకు ఎలాంటి అనుమానం లేదని బ్రెజిల్ కోచ్ టిటో ఆత్మ విశ్వాసం వ్యక్తం చేశాడు.

lukaku

కీలక ఆటగాళ్లు..

బెల్జియం: ఈడెన్ హజార్డ్: బెల్జియం ఫార్వర్డ్ ఆటగాడు.. అద్భుతమైన వేగం..మిగిలిన ఆటగాళ్లతో సమన్వయం కలిగిన హజార్డ్ జట్టుకు అవసరమైన సమయంలో గోల్స్ సాధించగలడు.. ఇప్పటివరకు హజార్డ్ 2 గోల్స్ కొట్టాడు. పెనాల్టీలను గోల్‌గా మలచడంలో అతనిది మంచి రికార్డు.. బ్రెజిల్ డిఫెన్స్‌కు అతను పరీక్ష పెట్టే అవకాశం ఉంది..

రొమేలు లుకాకు: మాంచెస్టర్‌యునైటెడ్ క్లబ్ ైస్ట్రెకర్‌గా రొమేలు లుకాకు సాకర్ ఫ్యాన్స్‌కు చిరపరిచితుడు.. ఈ ప్రపంచకప్‌లో 4 గోల్స్ సాధించి గోల్డెన్‌బూట్ రేసులో రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. జట్టు అవసరాలమేరకు అన్ని రకాల పాత్రను పోషించడంలో దిట్ట.. అద్భుతమైన డ్రిబ్లింగ్ స్కిల్స్..అమోఘమైన ఫిట్‌నెస్..మైదానంలో జట్టుకు ఎప్పుడూ లుకాకు అదనపు బలం.. అవకాశం దొరికితే ఎప్పుడైనా గోల్ కొట్టగలడు. ఆఖరి క్షణంలోనూ జయాపజయాలను తారుమారు చేసే సామర్థ్యం అతని సొంతం.. బ్రెజిల్‌ను నిలువరించాలంటే లుకాకు రాణించడం అత్యవసరం.. కెవిన్ డిబ్రుయెన్:మాంచెస్టర్ సిటీ ఆటగాడు..బెల్జియం జట్టులో స్టార్ ఆటగాడు. ప్రపంచంలోని అత్యుత్తమ మిడ్‌ఫీల్డర్లలో ఇతనొకడు. అసాధారణ వేగంతో గోల్ అవకాశాలను సృష్టించగలడు. ఇప్పటివరకు బెల్జియం విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. బ్రెజిల్‌పై విజయం దక్కాలంటే ..జట్టు సెమీస్ చేరాలంటే కెవిన్ రాణించడంపైనే అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

బ్రెజిల్నెయ్‌మార్: ఒకప్పుడు బ్రెజిల్ అంటే దూకుడు.. ఎప్పుడూ డిఫెన్స్‌లో కాస్త వీక్‌గా కనిపించే బ్రెజిల్ తాజాగా అటాకింగ్‌తో పాటు డిఫెన్స్‌లోనూ అద్భుతంగా రాణిస్తున్న వేళ..జట్టు స్టార్ ైస్ట్రెకర్ నెయ్‌మార్‌పై అంతగా ఒత్తిడి లేకుండా పోయింది. మ్యాచ్ ఫలితాన్ని క్షణాల్లో మార్చగల అద్భుత ఆటగాడు నెయ్‌మార్.. ఈ ప్రపంచకప్‌లో 2 గోల్స్ సాధించాడు. ప్రత్యర్థి డి బాక్స్ సమీపంలో పొంచి ఉండే ఈ ైస్ట్రెకర్‌కు బంతి అందితే చాలు..గోల్ కొడతాడు. అతనికి సరైనరీతిలో బంతిని పాస్ చేయగలిగితే బెల్జియం జట్టుపై విజయం సులభమే..

పిలిప్పే కౌటినో: ఫిఫా ప్రపంచకప్‌లో బ్రెజిల్ ఆశలను మోస్తున్న మరో ్రైస్టెకర్.. ఇప్పటికే రష్యాలో రెండుగోల్స్ నమోదు చేశాడు. క్వార్టర్ ఫైనల్లో బెల్జియం జట్టును ఓడించాలంటే నెయ్‌మార్‌తో కలిసి..కౌటినో సంయుక్తంగా చెలరేగాల్సి ఉంది.. గాబ్రియెల్ జీసస్ గోల్స్ కొట్టలేకపోయినా..యువ పార్వర్డ్‌నూ బరిలో మొహరిస్తే.. బెల్జియం రక్షణశ్రేణి కకావికలు కావలసిందే.. వీరు సమిష్టిగా రాణిస్తే బ్రెజిల్ సెమీస్ చేరడం ఖాయం..

మార్సెలో, విలియన్: ప్రపంచ కప్ హాట్‌ఫేవరెట్ బ్రెజిల్ జట్టులో వీరిద్దరు కీలక మిడ్‌ఫీల్డర్లు. అవసరమైతే ఫార్వర్డ్ దళానికి బంతిని అందించడమే కాదు..వెనక్కి తగ్గి డిఫెండర్లకు సాయం అందిస్తారు. బెల్జియం లాంటి జట్టును నిలువరించాలంటే వీరిద్దరూ పూర్తి సామర్థ్యంతో రాణించాల్సిందే..

france
నిజ్ని నొవొగార్డో(రష్యా): రెండు జట్లూ సమవుజ్జీలే..ఎవరు గెలుస్తారో ఇప్పుడే కాదు... మ్యాచ్ ముగిసే క్షణం వరకూ ఎవరూ చెప్పరు.. అంత పటిష్ఠంగా..అంతకుమించిన సూపర్ ఫాం..స్టార్ల తళుకులు.. ఆటలో మెరుపులు..ఒకటేమిటి..అన్నీ పుష్కలంగా అమరిని ఆ రెండు జట్ల పోరులో కేవలం ఒక జట్టే సెమీస్ చేరుతుందంటే ఫుట్‌బాల్ కష్టమనిపించక తప్పదు.. అర్జెంటీనా లాంటి స్టార్ జట్టును ఇంటికి పంపి క్వార్టర్స్ చేరిన ఫ్రాన్స్ ఒకవైపు.. పోర్చుగల్‌ను మట్టికరిపించి తుది ఎనిమిది జాబితాలో చేరిన ఉరుగ్వే నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో హోరాహోరీగా తలపడనున్నాయి. ఉరగ్వే జట్టులో లూయిస్ సురెజ్, కవాని ఇప్పటికే గోల్స్ చేస్తూ జట్టులో సూపర్ ైస్ట్రెకర్లుగా వారి పాత్రను సమర్థంగా పోషిస్తున్నారు. దుర్భేద్యమైన ఉరుగ్వే డిఫెన్స్‌ను ఛేదించాలంటే ప్రంపచస్థాయి ైస్ట్రెకర్లూ చెమటోడ్చాల్సిందే.. అంతకుమించి అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తేనే ఉరుగ్వే రక్షణపంక్తిని ఛేదించే అవకాశం ఉంటుంది.. కాగా, ఫ్రాన్స్ జట్టులో నవయువ సంచలనం ఎంబాప్పే, పోగ్బా, గ్రిజ్‌మన్, హెర్నాండెజ్ లాంటి స్టార్లతో జట్టు అజేయంగా కనిపిస్తున్నది. ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ కాని ఫైనల్‌గా.. అభివర్ణిస్తున్న ఈమ్యాచ్ టఫ్‌గా సాగనుంది. అభిమానులకు కనులవిందుగా.. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో మరో అద్భుతమ్యాచ్‌గా మిగిలపోనుందని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.

GRIEZMAN
కీలక ఆటగాళ్లు..ఫ్రాన్స్: ఎంబాప్పే, పోగ్బా, గ్రిజ్‌మన్, హెర్నాండెజ్. ఎంబాప్పే 4 గోల్స్ తో గోల్డెన్ బూట్‌రేసులో దూసుకుపోతున్నాడు. మ్యాచ్‌లో సందు దొరికితే గోల్స్ వర్షం కురిపించగల ఏంబాప్పేను అప్పట్లో టీనేజ్‌లో రంగప్రవేశం చేసిన బ్రెజిల్ దిగ్గజం పీలేతో పోలుస్తున్నారు. ప్రిక్వార్టర్స్‌లో అర్జెంటీనాపై వరుసగా రెండుగోల్స్ కొట్టి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఉరుగ్వేలాంటి జట్టుపై ఈ యువకిశోరం మరోసారి రాణిస్తేనే ఫ్రాన్స్ సెమీస్ చేరగలుగుతుంది.

పోగ్బా, గ్రిజ్‌మన్: గ్రిజ్‌మన్ జట్టుకు లభించిన రెండు పెనాల్టీలను గోల్‌గా మలిచాడు. దీంతో ఫ్రాన్స్‌తో ఆడే ప్రత్యర్థులు ఫౌల్ చేయాలంటే కాస్త ఆలోచించాల్సిందే. ఎంబాప్పే తోడుగా గ్రిజ్‌మన్ కూడా గోల్స్ కొడుతుండడంతో సునాయాస విజయాలతో జట్టు నాకౌట్ చేరింది.. అర్జెంటీనాతో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లోనూ గ్రిజ్‌మన్ ..పోగ్బా తోడుగా నిలువడంతో ఎంబాప్పే చెలరేగిన సంగతి తెలిసిందే.. వీరికి తోడుగా ఫ్రాన్స్ డిఫెండర్లు మరోసారి ఆకట్టుకుంటే ఉరుగ్వే ైస్ట్రెకర్లను నిలువరించగలిగితే విజయం వారిదే..

ఉరుగ్వే: సురెజ్, కవాని, జోస్ గిమినెజ్, గోడిన్ఉరుగ్వే జట్టులో సురెజ్ రెండుగోల్స్ కొట్టగా... కవాని 3 గోల్స్‌తో మెరుపులు మెరిపించాడు. పోర్చుగల్‌తో జరిగిన ప్రిక్వార్టర్స్‌లో కవాని ఒంటిచేత్తో జట్టుకు విజయాన్నందించాడు. సురెజ్‌తోపాటు కవాని కూడా సూపర్ ఫాంలో దూసుకుపోతుండడంతో ఉరుగ్వే మరింత పటిష్ఠమైన జట్టుగా రూపొందింది. ఎలాగూ డిఫెన్స్‌లో అద్భుత వనరులుండగా..వీరిద్దరూ అద్భుతంగా రాణిస్తుండడంతో ఫ్రాన్స్‌కు కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. వీరికి తోడుగా గోడిన్ డిఫెన్స్‌లో రాణిస్తే ఉరుగ్వేకు తిరుగుండదు..

జట్లు అంచనా

బ్రెజిల్:
అలిసన్, ఫాగ్నర్, టియాగో సిల్వా, మిరాండా, ఫిలిపే లూయిస్/మార్సెలో, ఫెర్నాండినో, పౌలినో, విలియన్, ఫిలిప్పే కౌటినో, నెయ్‌మార్, గాబ్రియెల్ జీసస్.

బెల్జియం:
తిబౌట్ కౌర్టియోస్, జాన్ వెర్టోంగెన్, విన్సెంట్ కోంపనీ, టోబీ ఆల్డర్‌విర్లెడ్, అక్సెల్ విసెల్, కెవిన్ డిబ్రుయెన్, నాసర్ చాడ్లీ, థామస్ మునియెర్, ఫెల్లాని, ఈడెన్ హజార్డ్, రొమేలు లుకాకు.

దోస్తుల కుస్తీ!

ఎక్కడైనా బావే కానీ.. వంగతోట దగ్గర కాదన్న పాత సామెతను బ్రెజిల్ ..బెల్జియం ఆటగాళ్లు తాజాగా గుర్తు చేస్తున్నారు.. బెల్జియం స్టార్ మిడ్‌ఫీల్డర్ డిబ్రుయెన్.. బ్రెజిల్ ఆటగాడు ఫెర్నాండో..ఇద్దరూ మాంచెస్టర్ సిటీకి కలిసి ఆడుతారు... వీరిద్దరి మధ్య మంచి సమన్వయం ఉంటుంది. క్లబ్ ఫుట్‌బాల్‌లో వీరిద్దరే జట్టుకు కీలకం. కాగా.. ఫిఫా ప్రపంచకప్‌లో మాత్రం ఇప్పుడు ఇద్దరూ ప్రత్యర్థులుగా దిగుతున్నారు..

ఉరుగ్వే ఆటగాడు డీగో గోడిన్.. ఫ్రాన్స్ స్టార్ గ్రిజ్‌మన్ ఇద్దరూ క్లబ్ ఫుట్‌బాల్‌లో సహచరులు.. అట్లెటికో మాడ్రిడ్ క్లబ్‌కు నాలుగేండ్లుగా కలిసి ఆడుతున్నారు. ఇద్దరూ మంచి మిత్రులు.. కానీ..నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో ఇద్దరూ ప్రత్యర్థులుగా మైదానంలో తలపడనున్నారు. గ్రిజ్‌మన్ కూతురు మియాకు గాడ్‌ఫాదర్‌గా గోడిన్‌ను పిలుస్తారు.. వీరి కుటుంబాలమధ్య అంత చనువుంది..

850

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles