యువీకి చోటు దక్కేనా!


Sun,August 13, 2017 12:23 AM

న్యూఢిల్లీ: శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు భారత జట్టు ఎంపికపై సందిగ్ధత కొనసాగుతున్నది. ఎవరికి విశ్రాంతి ఇవ్వాలి, ఎవర్ని జట్టులోకి తీసుకోవాలన్న దానిపై సెలెక్టర్లు ఎటూ తేల్చులేకపోతున్నారు. డాషిం గ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆఖరి అవకాశం కో సం ఎదురుచూస్తుండగా, కర్ణాటక బ్యాట్స్‌మన్ మనీ ష్ పాండే ఈ సిరీస్‌పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. కెప్టె న్ కోహ్లీ, రహానే విశ్రాంతి అవసరం లేదని ఇప్పటికే స్పష్టం చేయడంతో బ్యాటింగ్‌లో ఎవరికి అవకాశం క ల్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ధవన్, రాహుల్ మంచి ఫామ్‌లో ఉండటంతో నేరుగా వీరికి అవకాశం ఇస్తారా? అప్పుడు రోహిత్ పరిస్థితి ఏంటి? విండీస్‌లో రహానే, దినేశ్ కార్తీక్ బాగా ఆకట్టుకున్నారు. మరి ఈ ఇద్దర్ని కొనసాగిస్తారా? కెరీర్‌లో చివరి అంకంలో ఉన్న యువరాజ్, ధోనీని ఏం చేస్తారు? సెలెక్టర్ల నిర్ణయం ఎలా ఉండబోతుందో ఆదివారం స్పష్టంకానుంది.

279

More News

VIRAL NEWS

Featured Articles