టెస్ట్‌ల్లో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహీ(930) టాప్‌లో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 59.3 సగటుతో 593 పరుగులు చేసిన విరాట్ తన నంబర్‌వన్ ర్యాంకింగ్‌ను నిలబెట్టుకున్నాడు. బౌలింగ్‌లో జేమ్స్ అండర్సన్(899) టాప్‌లో కొనసాగుతుండగా, జడేజా(814), అశ్విన్(769) వరుసగా నాలుగు, ఎనిమిది ర్యాంక్‌ల్లో ఉన్నారు.