ఈడెన్‌తోనే మొదలు..


Tue,November 14, 2017 02:02 AM

saha
తొలి టెస్టులో విజయం సాధించడమే తమ ముందున్న మొదటి లక్ష్యమని భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా తెలిపాడు. తొలి టెస్టుకు వేదికైన ఈడెన్ గార్డెన్స్ లో పిచ్ ను ఇంకా చూడలేదని, పిచ్ ఎలా ఉన్నా విజయంపైనే అందరం దృష్టి పెట్టామన్నాడు. తొలి టెస్టులో గెలిస్తే.. అది మిగిలిన టెస్టుల్లోనూ జోరు చూపేందుకు తోడ్పడుతుందన్నాడు. దక్షిణాఫ్రికా పర్యటన గురించి ఇప్పుడే ఆలోచించబోమని, ప్రతీ మ్యాచ్ తమకు ముఖ్యమేనన్నాడు. ఒక మ్యాచ్ ముగిసిన తర్వాతే మరో మ్యాచ్ గురించి ఆలోచిస్తామని సాహా తెలిపాడు. భారత స్పిన్నర్లలో అశ్విన్ వైవిధ్యభరితమైన బౌలర్ అని కితాబిచ్చాడు. ఈ ఆఫ్ స్పిన్నర్‌ను ఎదుర్కోవడం ఏ బ్యాట్స్‌మెన్‌కైనా సవాలేనని వెల్లడించాడు. పేస్ బౌలర్ల విషయానికొస్తే ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ వేసే బంతులను వికెట్ల వెనకాల పట్టుకోవడం చాలా కష్టమన్నాడు. భువనేశ్వర్, ఉమేశ్ బౌలింగ్‌లో స్వింగ్ ఎక్కువగా ఉండటం వల్ల వికెట్ కీపింగ్ సులువుగా చేయొచ్చని అభిప్రాయపడ్డాడు. ఇక మైదానంలో అప్పుడప్పుడు బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ మొహరింపులో తాను కొన్ని సలహాలు సూచనలు ఇచ్చినా.. తుది నిర్ణయం మాత్రం కోహ్లీయే తీసుకుంటాడని స్పష్టం చేశాడు.

272

More News

VIRAL NEWS