క్రీడలకు ప్రోత్సాహం : మంత్రి హరీశ్ రావు


Mon,November 11, 2019 03:15 AM

harish
సిద్దిపేట కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆచార్య జయశంకర్ స్టేడియంలో వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం సిద్దిపేట అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యాలయాన్ని మంత్రి హరీశ్ ప్రారంభించి మాట్లాడారు. సిద్దిపేట స్పోర్ట్స్ హబ్‌గా తయారు కావాలని ఆకాంక్షించారు. రూ.6 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ స్థాయి స్విమ్మింగ్‌పూల్ నిర్మించామని, దాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు పాల సాయిరాం, టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.

100

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles