10 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించారు..


Thu,October 11, 2018 12:52 AM

-టీ20 చరిత్రలో మలేసియా అరుదైన విజయం
కౌలాలంపూర్: సుదీర్ఘ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా లక్ష్యాన్ని ఛేదించిన సరికొత్త రికార్డు నమోదైంది. మలేసియా రాజధాని కౌలాలంపూర్ వేదికగా జరుగుతన్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ అర్హత టోర్నీలో కేవలం 10 బంతుల్లోనే లక్ష్యాన్ని అధిగమించిన మలేసియా జట్టు అరుదైన రికార్డును అందుకుంది. క్రికెట్‌లోని ఏ ఫార్మాట్‌లోనైనా ఇదే వేగవంతమైన ఛేదన కావడం విశేషం. బుధవారం మైన్మార్‌తో జరిగిన మ్యాచ్‌లో మలేసియా లెఫ్టార్మ్ స్పిన్నర్ పవన్‌దీప్ సింగ్ (5/1) స్పిన్‌తో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన మైన్మార్ జట్టు విలవిల్లాడింది. 10.1 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 9 పరుగులు మాత్రమే చేసిన సమయంలో భారీవర్షం కురియడంతో ఆటకు అంతరాయం కలిగింది. అనంతరం డక్‌వర్త్‌లూయిస్ పద్ధతిలో మలేసియా విజయలక్ష్యం 6 పరుగులుగా నిర్ణయించగా.. 1.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 11 పరుగులు చేసి విజయం సాధించింది. తొలి ఓవర్‌లోనే పరుగులేమీ చేయకుండా ఓపెనర్ల వికెట్లను మలేసియా నష్టపోయింది. వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ సుహాన్(7), మునియాండి(4) పరుగులు చేసి మైన్మార్‌పై గెలిపించాడు. విజయానికి 1పరుగు అవసరమైన సమయంలో సుహాన్ కళ్లు చెదిరే సిక్సర్‌తో జట్టును గెలిపించడం విశేషం.

258
Tags

More News

VIRAL NEWS