బీసీసీఐ కొత్త అంబుడ్స్‌మన్‌గా రిటైర్డ్ జడ్జి డీకే జైన్


Fri,February 22, 2019 12:55 AM

DKJainన్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కొత్త అంబుడ్స్‌మన్‌గా మాజీ న్యాయమూర్తి డీకే జైన్‌ను సుప్రీంకోర్టు నియమించింది. జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే, ఏఎం సప్రే సారథ్యంలోని ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం వెలువరించింది. బీసీసీఐ కొత్త రాజ్యాంగం ప్రకారం సర్వసభ్య సమావేశంతోపాటు బోర్డు ఎన్నికకు ముందుగా విచారణాధికారి నియామకం పూర్తి చేయాలని సుప్రీం నియమిత పరిపాలకుల కమిటీ(సీవోఏ) తెలుపడంతో గురువారం డీకే జైన్ పేరుకు ఓకే చెప్పింది. కొత్త సీవోఏ సభ్యుడిగా లెఫ్టినెంట్ జనరల్ రవి తోడ్గే నియామకమయ్యారు. గతంలో నలుగురు సభ్యులతో బీసీసీఐ పరిపాలకుల కమిటీని సుప్రీంకోర్టు నియమించిన విషయం తెలిసిందే. సీవోఏ నుంచి రామచంద్ర గుహ, బ్యాంకర్ విక్రమ్ లిమాయే రాజీనామా చేసిన విషయాన్ని అమికస్‌క్యూరీ నర్సింహ బెంచ్ దృష్టికి తీసుకురావడంతో రవి తోడ్గేను మూడో సభ్యుడిగా బెంచ్ నియమించింది.

254
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles