జోషీ, పవార్ సహా 20 మంది..


Fri,August 10, 2018 12:23 AM

suniljoshi
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు కోచ్ పదవికి దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. మాజీ స్పిన్నర్ సునీల్ జోషీ, రమేశ్ పవార్‌తో సహా 20 మంది ఈ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. వీళ్లందరికి శుక్రవారం ముంబైలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఇప్పటికే మాజీ వికెట్ కీపర్ అజయ్ రాత్రా, విజయ్ యాదవ్, మహిళల మాజీ కెప్టెన్ మమతా మాబెన్, సుమన్ శర్మ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అసిస్టెంట్ కోచ్‌గా పని చేసిన పూర్ణిమా రావు ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నది. న్యూజిలాండ్ ప్లేయర్ మారియా ఫాహె కూడా కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవడం విశేషం. కెరీర్‌లో ఈమె 2 టెస్టులు, 51 వన్డేలు ఆడింది. ప్రస్తుతం మారియా గుంటూరులోని ఏసీఏ అకాడమీలో కోచ్‌గా పని చేస్తున్నది. అయితే సునీల్ జోషీ, రమేశ్ పవార్ కోచ్ రేసులో ముందున్నారు. తుషార్ ఆర్తో పదవి నుంచి వైదొలిగిన తర్వాత పవార్ తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహించాడు. ఒమన్, బంగ్లాదేశ్ జట్లకు కోచ్‌గా పని చేసిన జోషీకి అంతర్జాతీయ క్రికెట్‌లో విశేష అనుభవం ఉంది. భారత్ తరఫున 15 టెస్టులు, 69 వన్డేలు ఆడాడు. అస్సాం, హైదరాబాద్, జమ్మూకశ్మీర్ జట్లకు 160 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో కోచింగ్ ఇచ్చాడు.

298

More News

VIRAL NEWS