అంబ్రీస్ భారీ సెంచరీ


Sun,May 12, 2019 01:06 AM

డబ్లిన్: ముక్కోణపు వన్డే టోర్నీలో వెస్టిండీస్ రెండో విజయాన్ని నమోదు చేసింది. శనివారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విండీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఐర్లాండ్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 327 పరుగులు చేసింది. ఆండీ బాల్‌బిర్నై (135; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీకి, స్టిర్లింగ్ (77; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), కెవిన్ ఓబ్రెయన్ (63; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలు తోడవడంతో భారీ స్కోరు చేయగలిగింది. లక్ష్యఛేదనలో సునీల్ ఆంబ్రిస్ (126 బంతుల్లో 148; 19 ఫోర్లు, 1 సిక్స్) భారీ సెంచరీతో చెలరేగడంతో విండీస్ 47.5 ఓవర్లలో 5 వికెట్లకు 331 పరుగులు చేసింది. ఆంబ్రిస్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

159
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles