రాష్ట్ర స్థాయి టార్గెట్ బాల్ పోటీలు ప్రారంభం


Mon,November 11, 2019 03:21 AM

ramanna
ఎదులాపురం : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మహాత్మాజ్యోతి బాఫూలే ఆవరణలో 65వ రాష్ట్రస్థాయి అండర్-17, 19 బాలబాలికల టార్గెట్ బాల్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఉమ్మడి పది జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ పోటీలకు మాజీ మంత్రి జోగు రామన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడాకారుల నుంచి గౌరవవందనం స్వీకరించిన అనంతరం ఆయన పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని జిల్లాకు పేరు తీసుకురావాలని సూచించారు. మారుమూల జిల్లా అయిన ఆదిలాబాద్‌లో రాష్ట్ర స్థాయి పోటీలు జరుగడం సంతోషకరం అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ రాజన్న, ఎంపీపీ ఈశ్వరి, జడ్పీటీసీ వనిత, సర్పంచ్ ప్రమీల తదితరులు పాల్గొన్నారు.

121

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles