గీసుగొండలో రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలు ప్రారంభం


Sat,January 12, 2019 02:34 AM

soft-bal
గీసుగొండ: రాష్ట్ర అంతర్‌జిల్లాల సబ్ జూనియర్స్ సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు శుక్రవారం వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రారంభమయ్యాయి. వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు వీరాగోని రాజుకుమార్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈపోటీలను ఆర్జేడీ రాజీవ్, సాఫ్ట్‌బాల్ జిల్లా చైర్మన్ చల్లా జ్యోతి ప్రాంభించారు. 15 జిల్లాల నుంచి సాఫ్ట్‌బాల్ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ చైర్మన్ సాంబశివరావు తెలిపారు.

168

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles