రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలు ప్రారంభం


Mon,February 11, 2019 02:16 AM

Handball
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్: రాష్ట్రస్థాయి సీనియర్ హ్యాండ్‌బాల్ టోర్నీ ఆదివారం ప్రారంభమైంది. వరంగల్ 29-12తో నల్లగొండపై , ఖమ్మంపై 28-20తో గెలువగా, హైదరాబాద్ మెదక్‌పై 39-06, ఆదిలాబాద్‌పై 31-09 తేడాతో, రంగారెడ్డి ఆదిలాబాద్‌పై 30-21, మహబూబ్‌నగర్‌పై 21-19తో గెలిచింది. మహబూబ్‌నగర్ జట్టు మెదక్‌పై 26-08, కరీంనగర్ జట్టు ఖమ్మంపై 22-17, నిజామాబాద్‌పై 29-23 స్కోర్ తేడాతో గెలిచింది. నిజామాబాద్ జట్టు నల్లగొండపై 28-10 స్కోర్ తేడాతో గెలిచింది. టోర్నీలో పాత పది జిల్లాల నుంచి 160 మంది క్రీడాకారులు, 50 మంది కోచ్, మేనేజర్లు టోర్నీలో పాల్గొన్నారు.

400

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles