రాష్ట్రస్థాయి క్యారమ్స్ పోటీలు ప్రారంభం


Tue,August 22, 2017 01:26 AM

జ్యోతినగర్, నమస్తే తెలంగాణ: రాష్ట్రస్థాయి సీనియర్ ఓపెన్ ర్యాంకింగ్ క్యారమ్స్ చాంపియన్‌షిప్ ప్రారంభమైంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎన్టీపీసీ టౌన్‌షిప్ జ్యోతిక రిక్రియేషన్ క్లబ్‌లో జరిగిన ప్రారంభ కార్యక్రమానికి ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టు జీఎం ఎమ్‌ఎన్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. రాష్ట్ర క్యారమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా క్యారమ్స్ సంఘం, రామగుండం ఎన్టీపీసీ సహకారంతో ఈ పోటీలు జరుగుతున్నాయి. ఈనెల 24వరకు జరుగనున్న ఈ చాంపియన్‌షిప్‌లో రాష్ట్రవ్యాప్తంగా 150మంది క్రీడాకారులు పోటీపడుతున్నారు.

89

More News

VIRAL NEWS