రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ టోర్నీ ప్రారంభం


Sun,October 13, 2019 12:17 AM

AthleticsTournament
సూర్యాపేటటౌన్: క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల మైదానంలో రాష్ట్రస్థాయి 6వ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలను మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2014 తరువాత అనేక క్రీడాపోటీలకు సూర్యాపేట వేదికగా నిలిచిందన్నారు. చదువుతోపాటు క్రీడలు ఎంతో అవసరమని, ఎలా జీవించాలో క్రీడలు నేర్పుతాయన్నారు. క్రీడాస్ఫూర్తి లోపించడంతోనే విద్యార్థుల్లో మానసిక ైస్థెర్యం కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మె ల్సీ తేరా చిన్నపరెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లిం గయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ వెంకట నారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

117

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles