రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలు ప్రారంభం


Fri,October 12, 2018 12:14 AM

local
కరీంనగర్ స్పోర్ట్స్: జిల్లా రెజ్లింగ్ సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని కొత్తపల్లి ఆల్ఫోర్స్ ఇ- టెక్నోస్కూల్‌లో 5వ తెలంగాణ రాష్ట్రస్థాయి అమోచ్యూర్ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్-2018 పోటీలు గురువారం రాత్రి ప్రారంభమయ్యాయి. రెండురోజులపాటు జరుగునున్న ఈ పోటీలను కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 120 మంది రెజ్లర్లు పోటీలో పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన రెజ్లర్లు జాతీయస్థాయి పోటీలలో రాష్ర్టానికి ప్రాతినిథ్యవహించనున్నారు. ఈ కార్యక్రమంలో పోటీల నిర్వహణ కమిటీ చైర్మన్ డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి, డీవైఎస్‌వో అశోక్‌కుమార్, కరీంనగర్ జిల్లా రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు తుమ్మల రమేశ్‌రెడ్డి, కార్యదర్శి మహ్మద్ కరీం తదితరులు పాల్గొన్నారు.

255

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles