స్టార్‌కు ఆడియో విజువల్ హక్కులు


Tue,February 20, 2018 02:29 AM

ముంబై: ఐపీఎల్, దేశవాళీ క్రికెట్ మ్యాచ్ ఆడియో విజువల్ హక్కులను స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. ఇప్పటికే ఐదేండ్ల కాలానికి రికార్డు స్థాయిలో రూ.16,347 కోట్లకు ఐపీఎల్ ప్రసార హక్కులను కైవసం చేసుకున్న స్టార్ మీడియా దేశవాళీ టోర్నీల్లోనూ తమదైన ముద్ర వేసేందుకు సిద్ధమైంది. 2018-19 సీజన్‌కు గాను ఐపీఎల్, దేశవాళీ ఆడియో విజువల్ హక్కుల కోసం ఆహ్వానించగా స్టార్ సంస్థ బిడ్‌ను దక్కించుకుందని బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరీ ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. అయితే ఎంత మొత్తంలో ఒప్పందం జరిగిందనేది బీసీసీఐ బయటికి వెల్లడించలేదు.

222

More News

VIRAL NEWS