ఈ సీజన్‌లో సత్తాచాటుతాం


Thu,July 18, 2019 03:50 AM

telugu-titansM
హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: త్వరలో ప్రారంభం కానున్న ఏప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)డో సీజన్‌లో సత్తాచాటుతామని తెలుగు టైటాన్స్ జట్టు యాజమాన్యం ధీమా వ్యక్తం చేసింది. స్థానిక గచ్చిబౌలీ స్టేడియం వేదికగా ఈనెల 20 నుంచి పీకేఎల్ టోర్నీ మొదలుకాబోతున్నది. ఈ నేపథ్యంలో బుధవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగు టైటా న్స్ జట్టు యజమాని శ్రీరామనేని శ్రీనివాస్ మాట్లాడారు. తెలుగు టైటాన్స్ జట్టు సొంతగడ్డ హైదరాబాద్‌లో అదరగొట్టేందుకు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నది. స్వదేశీ, విదేశీ ఆటగాళ్ల సమాహారంతో జట్టు ఈసారి పటిష్ఠంగా కనిపిస్తున్నది. పీకేఎల్ ద్వారా చాలా మంది ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. ప్రస్తుతం వారిప్పుడు చాలా మంది యువతకు రోల్ మోడల్స్‌గా మారారు అని శ్రీనివాస్ అన్నారు. మరోవైపు జట్టు కోచ్ ఘోల్‌మ్రెజా మాట్లాడుతూ ప్రతి జట్టు ఒక్కో జట్టుతో మూడు మ్యాచ్‌లు ఆడుతుంది. ఒక జట్టు వరుసగా రెండు గెలిస్తే మూడో మ్యాచ్‌కు అంతగా ప్రధాన్యముండదు. కొత్త ఫార్మాట్ ప్రకారం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ప్రతి జట్టుకు సమాన అవకాశాలున్నాయి అని అన్నాడు. ఈ కార్యక్రమంలో స్టార్ ఆటగాడు సిద్దార్థ్ దేశాయ్, త్రినాథ్, జగదీశ్, రాష్ట్ర ఆటగాడు మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు.

395

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles