ఎఫ్‌ఐహెచ్ అథ్లెట్స్ కమిటీలో శ్రీజేష్

Thu,January 12, 2017 01:29 AM

న్యూఢిల్లీ: భారత హాకీ కెప్టెన్ పీఆర్ శ్రీజేష్‌కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఎఫ్‌ఐహెచ్) అథ్లెట్స్ కమిటీలో శ్రీజేష్ సభ్యునిగా ఎంపికయ్యాడు. మొత్తం ఎనిమిది మందితో కూడిన కమిటీలో నలుగురు మాజీ ఆటగాళ్లతో పాటు నలుగురు ప్రస్తుతం తమ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లు ఉంటారు. అథ్లెట్స్‌కు ఎఫ్‌ఐహెచ్ మధ్య వీరందరు అనుసంధాన కర్తలుగా వ్యవహరిస్తారు. మోరిట్జ్ ప్యూయర్సెలాంటి దిగ్గజ ఆటగాళ్ల సరసన కమిటీలో చోటు దక్కించుకోవడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా శ్రీజేష్ అన్నాడు.

302

More News

మరిన్ని వార్తలు...