కాంస్యంతో మెరిసిన శ్రీశ్వాన్


Sun,October 13, 2019 12:34 AM

chess

-ప్రపంచ యూత్ చెస్ చాంపియన్‌షిప్

ఎల్లారెడ్డి, నమస్తే తెలంగాణ: తెలంగాణ యువ చెస్ ప్లేయర్ మర్లశికారి శ్రీశ్వాన్ మరోమారు సత్తాచాటాడు. ముంబైలో జరిగిన వరల్డ్ యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో శ్రీశ్వాన్ కాంస్య పతకంతో మెరిశాడు. అండర్-14 విభాగంలో బరిలోకి దిగిన శ్రీశ్వాన్ మొత్తం 11 రౌండ్లలో ఎనిమిది పాయింట్లు సొంతం చేసుకుని మూడో స్థానంలో నిలిచాడు. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన ఈ కామారెడ్డి కుర్రాడు ప్రత్యర్థులకు దీటైన సవా లు విసురుతూ పతకం సొంతం చేసుకున్నాడు. ఇదే విభాగంలో భారత్‌కు చెందిన శ్రీహరికి రజత పతకం దక్కింది. వరల్డ్ యూత్ చెస్ టోర్నీలో శ్రీశ్వాన్ ఆటతీరును స్థానికులు అభినందించారు. ఎనిమిదో ఏట నుంచి చెస్ ఆడుతున్న ఈ యువ సంచలనం అంచలంచెలుగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలతో మెరుస్తున్నాడు. మరోవైపు రాష్ట్ర యువ చెస్ క్రీడాకారిణి బేబి సరయు ఎనిమిదో స్థానంతో సంతృప్తి పడింది. తనకంటే మెరుగైన ర్యాంకర్ అంతర్జాతీయ మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్(మహారాష్ట్ర)ను ఓడించిన సరయు టోర్నీలో మొత్తంగా 186 ఎలో రేటింగ్ పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది.

166

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles