దక్షిణాఫ్రికా విజయభేరి


Tue,July 18, 2017 12:41 AM

sai
-340 పరుగులతో ఇంగ్లండ్‌పై ఘనవిజయం
నాటింగ్‌హామ్: దక్షిణాఫ్రికా కసితీరా ప్రతీకారం తీర్చుకున్నది. లార్డ్స్ టెస్ట్‌లో ఎదురైన పరాజయానికి ట్రెంట్‌బ్రిడ్జ్‌లో దీటుగా బదులిచ్చింది. ఇంగ్లండ్‌పై తమ ఆధిపత్యం ఆద్యంతం కొనసాగించిన రెండో టెస్ట్‌లో మరో రోజు మిగిలుండగానే దక్షిణాఫ్రికా 340 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. దీంతో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ను ప్రస్తుతం 1-1తో సమం చేసింది. సఫారీలు నిర్దేశించిన 474 పరుగుల లక్ష్యఛేదన కోసం 1/0 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ 44.2 ఓవర్లలో 133 పరుగులకు కుప్పకూలింది. ఫిలాండర్(3/24), కేశవ్ మహరాజ్(3/42), ఒలీవర్(2/25), మోరిస్(2/7) ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. వీరి ధాటికి కుక్(42) మినహా అందరూ విఫలమయ్యారు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించిన ఫిలాండర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ ఈనెల 27న ఓవల్‌లో మొదలవుతుంది.

299

More News

VIRAL NEWS