సఫారీలదే మూడో వన్డే


Sun,January 27, 2019 12:33 AM

hedricks
సెంచూరియన్: పాకిస్థాన్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మూడో వన్డేలో సఫారీలు 13 పరుగుల తేడాతో(డక్‌వర్త్ లూయిస్) పాక్‌పై విజయం సాధించారు. పలుమార్లు వర్షం అంతరాయం మధ్య జరిగిన మ్యాచ్‌లో కుదించిన లక్ష్యాన్ని(33 ఓవర్లలో 175) 2 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. డీకాక్(33), ఆమ్లా(25) అందించిన ఆరంభాన్ని రెజా హెండ్రిక్స్(83 నాటౌట్), కెప్టెన్ డుప్లెసిస్(40 నాటౌట్) సాధికారిక ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించారు. హసన్ అలీ(1/33)కి ఒక వికెట్ దక్కింది. తొలుత ఇమాముల్ హక్(101) సెంచరీకి తోడు బాబర్ ఆజమ్(69), మహ్మద్ హఫీజ్(52) అర్ధసెంచరీలతో పాక్ నిర్ణీత ఓవర్లలో 317/6 స్కోరు చేసింది. తనపై వస్తున్న విమర్శలకు ఇమాముల్ హక్ సెంచరీతో సమాధానమిచ్చాడు. స్టెయిన్, రబాడ రెండేసి వికెట్లు తీశారు.

941

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles