కెప్టెన్లుగా హర్మన్‌ప్రీత్, స్మృతి


Wed,May 16, 2018 01:05 AM

harman
న్యూఢిల్లీ: ఐపీఎల్ ప్లే ఆఫ్‌నకు ముందు జరుగనున్న మహిళల టీ20 మ్యాచ్‌కు కెప్టెన్లను ప్రకటించారు. స్టార్ బ్యాట్స్‌వుమన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మందన రెండు జట్లకు నాయకత్వం వహించనున్నారు. దేశంలో మహిళల క్రికెట్‌కు పెరుగుతున్న ప్రజాదరణను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఈ మ్యాచ్ ఏర్పాటు చేశామని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు. మహిళలకు కూడా ఐపీఎల్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఇందులో భాగంగా ఇతర బోర్డులతో సంప్రదింపులు జరుపుతున్నాం. తుది ఫలితాలు కూడా బాగానే ఉన్నాయి అని శుక్లా పేర్కొన్నారు. న్యూజిలాండ్ కెప్టెన్ సుజి బేట్స్, సోఫీ డెవిన్, ఆసీస్ ఆల్‌రౌండర్ ఎల్సీ పెర్రీ, వికెట్ కీపర్ బ్యాట్స్‌వుమన్ అలెసా హీలి, మేఘనా షుట్, బెత్ మూనీ ఈ మ్యాచ్‌లో పాల్గొనేందుకు ఇప్పటికే తమ అంగీకారాన్ని తెలిపారు. ఇంగ్లండ్‌కు చెందిన డానీ వైట్, డానీ హాజెల్ కూడా వచ్చే అవకాశాలున్నాయి. వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.
smriti-mandana

840

More News

VIRAL NEWS