పోరాడకుండానే..


Sun,April 14, 2019 02:50 AM

- సెమీస్‌లో సింధు ఓటమి సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
sindhuu
సింగపూర్: స్టార్ షట్లర్ పీవీ సింధుకు సింగపూర్ ఓపెన్‌లో చుక్కెదురైంది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో నాలుగో సీడ్ సింధు 7-21, 11-21తో ప్రపంచ మాజీ చాంపియన్, రెండో సీడ్ నజోమి ఒకుహర (జపాన్) చేతిలో పరాజయం పాలైంది. ముఖాముఖీ జరిగిన గత రెండు మ్యాచ్‌ల్లో జపాన్ అమ్మాయిపై పైచేయి కనబర్చిన సింధు ఈ మ్యాచ్‌లో కనీస ప్రతిఘటన ఇవ్వలేక చేతులెత్తేసింది. దీంతో ఈ టోర్నీలో భారత్ పోరాటం ముగిసినైట్లెంది. క్వార్టర్ ఫైనల్లో సైనా నెహ్వాల్‌ను చిత్తుచేసి జోరుమీదున్న ఒకుహర.. అదే ఊపులో సింధుపై నెగ్గి ఫైనల్ చేరింది.

తొలి గేమ్ ఆరంభంలోనే 1-4తో వెనుకబడిన సింధు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. రెండో గేమ్‌లోనైనా పోరాడుతుందనుకుంటే అదీ సాధ్యపడలేదు. అనవసర తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకుంది. ఓ వైపు ఒకుహర పూర్తి నియంత్రణతో షాట్లు ఆడుతుంటే.. సింధు మాత్రం అందుకు భిన్నంగా సైడ్‌లైన్, నెట్ దగ్గర తప్పులు చేస్తూ.. ప్రత్యర్థికి సులువుగా పాయింట్లు అప్పగించింది. రెండో గేమ్ ఆరంభంలో కాస్త పోటీనిస్తూ.. 4-4తో స్కోరు సమం చేసినా.. ఆ తర్వాత కనీస పోటీ ఇవ్వలేకపోయింది. క్రాస్ కోర్ట్ షాట్లతో విరుచుకుపడిన ఒకుహర 37 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించి ఫైనల్ చేరింది. తుదిపోరులో వరల్డ్ నంబర్‌వన్ తై జుయింగ్ (చైనీస్ తైపీ)తో ఒకుహర తలపడనుంది.

288

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles