క్వార్టర్‌ఫైనల్లో సైనా,సింధు


Fri,April 12, 2019 02:22 AM

-శ్రీకాంత్, సిక్కి జోడీ కూడా..

సింగపూర్: భారత బ్యాటింగ్ మేటి త్రయం పీవీ సింధు, సైనా నెహ్వాల్, శ్రీకాంత్.. సింగపూర్ ఓపెన్‌లో క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్‌ఫైనల్లో నాలుగోసీడ్ సింధు 21-13, 21-19తో మియా బ్లిచ్‌ఫెల్ట్ (డెన్మార్క్)పై గెలువగా, ఆరోసీడ్ సైనా 21-16, 18-21, 21-19తో పోర్న్‌పావి చొచువాంగ్ (థాయ్‌లాండ్)పై చెమటోడ్చి నెగ్గింది. 40 నిమిషాల పోరులో సింధు.. 3-0తో తొలి గేమ్‌ను ఆరంభించినా.. రెండో గేమ్‌లో ప్రత్యరిథ నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంది. ఓ దశలో 8-8తో స్కోరు సమమైనా.. బ్లిచ్‌ఫెల్ట్ దాటికి 11-15తో వెనుకబడింది. కానీ పట్టువిడవకుండా పోరాడిన సింధు 17-17తో స్కోరును సమం చేస్తూ ఆ తర్వాత నెట్ వద్ద మెరుగైన డ్రాప్స్ వేస్తూ గేమ్‌ను, మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. చొచువాంగ్‌తో గంటా 7 నిమిషాల పాటు జరిగిన పోరాటంలో సైనా తొలి గేమ్‌ను నెగ్గినా, రెండో గేమ్‌ను చేజార్చుకుంది. యితే నిర్ణాయక మూడో గేమ్‌లో సైనా 9-5తో ఆధిక్యంలో ఉన్నా చొచువాంగ్ సుదీర్ఘమైన ర్యాలీలు సంధిస్తూ 17-17తో స్కోరును సమం చేసింది. ఈ దశలో చొచువాంగ్ కొట్టిన రిటర్న్ షాట్స్ నెట్‌కు తాకడం భారత అమ్మాయికి కలిసొచ్చింది.
Saina

పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఆరోసీడ్ శ్రీకాంత్ 21-12, 23-21తో క్రిస్టియాన్ విట్టింగ్‌హాస్ (డెన్మార్క్)పై గెలిచాడు. మరో మ్యాచ్‌లో సమీర్ వర్మ 21-15, 21-18తో లు గుయాంగ్జ్ (చైనా)ను ఓడించి క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. ఇతర మ్యాచ్‌ల్లో పారుపల్లి కశ్యప్ 9-21, 21-15, 16-21తో నాలుగోసీడ్ చెన్‌లాంగ్ (చైనా) చేతిలో, హెచ్‌ఎస్ ప్రణయ్ 11-21, 11-21తో టాప్‌సీడ్ కెంటో మెమోటో (జపాన్) చేతిలో ఓడారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ప్రణవ్ చోప్రా-సిక్కి రెడ్డి 21-17, 6-21, 21-19తో ఐదోసీడ్ టాంగ్ చున్‌మన్-యింగ్ సుయెట్ (హాంకాంగ్)పై గెలిచి ముందంజ వేశారు. మహిళల డబుల్స్‌లో పూజ దండు-సంజన సంతోష్ 15-21, 12-21తో నమి మత్‌సుయమా-చిహర్ షిదా (జపాన్) చేతిలో ఓడారు.

213

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles