సింధుకు ఘన సన్మానం


Sat,September 14, 2019 12:17 AM

sindhu
అమరావతి, నమస్తే తెలంగాణ: ప్రతిష్ఠాత్మక బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకంతో మెరిసిన షట్లర్ పీవీ సింధును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం ఘనంగా సన్మానించింది. తొలుత సీఎం జగన్‌మోహన్ రెడ్డిని సచివాలయంలో సింధు కలుసుకుంది. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో సత్కరించి సీఎం జగన్ జ్ఞాపిక అందజేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. విశాఖపట్నంలో బాలికల బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు కోసం ఐదెకరాల స్థలం కావాలని సింధు కోరిందని, దానికి సీఎం సమ్మతించారని రాష్ట్ర క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస రావు పేర్కొన్నారు. ఆ తర్వాత రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను సింధు కలుసుకుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌ను సింధు సాధించడం సంతోషంగా ఉందని.. గవర్నర్ అన్నారు. శాట్స్ ఆధ్వర్యంలో సింధుకు సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాసరావు, కన్నబాబు, అధికార భాషా సంఘం అధ్యక్షుడు లక్ష్మి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

339

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles