క్యాన్సర్ రోగులకు సింధు అండ


Sat,January 13, 2018 03:36 AM

balakrishna
బంజారాహిల్స్: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు.. పేద క్యాన్సర్ రోగులకు అండగా నిలిచింది. కౌన్ బనేగా కరోడ్‌పతిలో తాను గెలుచుకున్న రూ. 25 లక్షల నగదు బహుమతిని.. బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ దవాఖానకు విరాళంగా ఇచ్చింది. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన చెక్‌ను దవాఖాన చైర్మన్ నందమూరి బాలకృష్ణకు అందజేసింది. పేద క్యాన్సర్ రోగులకు ఈ మొత్తాన్ని ఖర్చు చేయాల్సిందిగా సింధు సూచించింది. డబ్బులు గెలిచినప్పుడు వీటిని క్యాన్సర్ రోగులకు విరాళంగా ఇస్తానని బాలీవుడ్ నటుడు అమితాబ్‌కు ఇచ్చిన మాటను ఈ సందర్భంగా సింధు నిలబెట్టుకుంది. ఈ కార్యక్రమంలో సింధు తల్లిదండ్రులు రమణ, విజయతో పాటు మాజీ క్రికెటర్ చాముండేశ్వరినాథ్, ఆస్పత్రి సీఈవో డా.ప్రభాకర్‌రావు, మెడికల్ డైరెక్టర్ డా.టీఎస్,.రావు, సీవోవో బీ.కృష్ణమూర్తి,మెడికల్ సూపరిండెంట్ డా.కల్పనా రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.

169
Tags

More News

VIRAL NEWS

Featured Articles