భళా బైల్స్


Mon,October 14, 2019 01:34 AM

Biles

-25 పతకాలతో ఆల్‌టైం రికార్డు బ్రేక్

స్టట్‌గార్ట్: జిమ్నాస్టిక్స్ సంచనలం సిమోన్ బైల్స్ (అమెరికా) చరిత్ర సృష్టించింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 25వ పతకం సాధించి.. బెలారస్ పురుష జిమ్నాస్ట్ విటాలీ షెర్బో (23 పతకాలు) పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టింది. ప్రపంచంలో అత్యంత విజయవంతమైన జిమ్నాస్ట్‌గా బైల్స్ నిలిచింది. ప్రపంచ జిమ్నాస్టిక్ చాంపియన్‌షిప్‌లో చివరిరోజైన ఆదివారం ఇక్కడ జరిగిన బీమ్, ఫ్లోర్ ఫైనల్ పోటీల్లో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాలను చేజిక్కించుకోవడంతో బైల్స్ ఈ ఘనతలను అందుకుంది. మొత్తంగా ఈ ఏడాది చాంపియన్‌షిప్‌లో సిమోన్ ఏకంగా ఐదు స్వర్ణాలు తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటి వరకు ఐదుసార్లు చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న బైల్స్ 19 పసిడి పతకాలను పట్టడం విశేషం.

154

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles