దక్షిణాఫ్రికా-ఏ 164 ఆలౌట్


Tue,September 10, 2019 12:29 AM

తిరువనంతపురం: దక్షిణాఫ్రికా-ఏపై పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ అనధికారిక వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత్-ఏ.. టెస్టు సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. సోమవారం ఇక్కడ ప్రారంభమైన నాలుగు రోజుల అనధికారిక తొలి టెస్టులో భారత్-ఏ బౌలర్లు విజృంభించడంతో సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 51.5 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌటైంది. జాన్‌సెన్ (45) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో శార్దుల్ ఠాకూర్, కృష్ణప్ప గౌతమ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. నదీమ్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్-ఏ తొలిరోజు ఆట ముగిసే సమయానికి 38 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. అజేయ అర్ధశతకంతో ఆకట్టుకున్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (66 బ్యాటింగ్; 9 ఫోర్లు, 1 సిక్సర్)తో పాటు అంకిత్ బావ్నే (6) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం చేతిలో 8 వికెట్లు ఉన్న భారత్-ఏ తొలి ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 35 పరుగులు వెనుకబడి ఉంది.

374

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles