టైపై చాపెల్ కొత్త ప్రతిపాదన


Mon,July 22, 2019 02:38 AM

న్యూఢిల్లీ: ప్రపంచకప్ ఫైనల్లో బౌండరీలను పరిగణలోకి తీసుకొని ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించడంపై విమర్శలు, వాదనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ అంశంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ ఓ కొత్త ప్రతిపాదనను తెరమీదకు తీసుకుచ్చాడు. లీగ్ దశలో పాయిం ట్ల పట్టికలో జట్ల స్థానాలను పరిగణలోకి తీసుకోవాలి. ఫైనల్ టై అయిన సమయంలో విజేతను నిర్ణయించేందుకు ఉత్తమమైన దారి ఇదే. విజయాల వల్ల వచ్చిన పాయింట్లు లేదా రన్‌రేట్ వల్ల ఏదో ఒక జట్టు మెరుగైన స్థానంలోనే ఉంటుంది కాబట్టి ఈ విధానం సరైన సమాధానం చెబుతుంది అని ఓ వ్యాసంలో అతడు అభిప్రాయపడ్డాడు.

249

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles