టోక్యోకు చింకీ యాదవ్


Fri,November 8, 2019 11:58 PM

chinki-yadav
దోహా: భారత యువ షూటర్ చింకీ యాదవ్ టోక్యో (2020) ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఆసియన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరడం ద్వారా చింకీ విశ్వక్రీడల బెర్త్ ఖారరు చేసుకుంది. అయితే తుదిపోరులో మాత్రం చింకీ ఆకట్టుకోలేకపోయింది. 588 పాయింట్ల రికార్డు స్కోరుతో ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించిన చింకీ.. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్ తుదిపోరులో 116 పాయింట్లు సాధించి ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. ఇప్పటి వరకు టోక్యో ఒలింపిక్స్‌కు 10 మంది భారత షూటర్లు అర్హత సాధించగా.. ఇప్పుడు పింకీ 11వ షూటర్‌గా నిలిచింది. భారత్ నుంచి ఇప్పటికే ఈ విభాగంలో రాహీ సర్నోబత్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై కాగా.. ఇప్పుడు రెండో బెర్త్ దక్కింది. మహిళల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో భారత త్రయం తేజస్విని సావంత్, అంజుమ్ మౌద్గిల్, కాజల్ 1864.8 పాయింట్లతో స్వర్ణం నెగ్గింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ విభాగంలో సంజీవ్, శుభాంకర్, తరుణ్‌తో కూడిన భారత జట్టు 1865.1 పాయింట్లతో రజతం దక్కించుకుంది. పురుషుల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో ఉదయ్‌వీర్ రజతం నెగ్గగా.. ఉదయ్‌వీర్, విజయ్‌వీర్, గుర్‌ప్రీత్ త్రయం స్వర్ణం గెలుచుకుంది. యూత్ విభాగంలో భారత షూట ర్లు శుక్రవారం ఆరు స్వర్ణాలు సహా 11 పతకాలు సాధించడం విశేషం.

147

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles