యువ ఆటగాళ్లపైనే కన్ను


Mon,September 9, 2019 12:55 AM

GILL

-నేటి నుంచి సఫారీ-ఏతో భారత్-ఏ అనధికారిక తొలి టెస్టు

తిరువనంతపురం: దక్షిణాఫ్రికా-ఏపై వన్డే సిరీస్‌ను చెజిక్కించుకున్న భారత్-ఏ జట్టు టెస్టు పోరుకు సన్నద్ధమైంది. ఇరు జట్ల మధ్య రెండు టెస్టుల అనధికార సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ సోమవారం ఇక్కడ ప్రారంభం కానుంది. కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్ ఈ సిరీస్‌లోనూ అదరగొట్టి.. సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్ కోసం టీమ్‌ఇండియా తలుపులు తట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. అలాగే ఆంధ్రా వికెట్ కీపర్ కేఎస్ భరత్, కర్ణాటక ఆల్‌రౌండర్ కృష్ణప్ప గౌతమ్‌పై అందరి కండ్లు ఉండనున్నాయి. అలాగే ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌కు కూడా ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది. శివమ్ దూబే, నదీమ్ లాంటి మరికొంత మంది ఆటగాళ్లు ఈ సిరీస్‌లో రాణించి సెలెక్టర్లను మెప్పించాలని పట్టుదలగా ఉన్నారు.

438

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles