జిమ్‌లో గబ్బర్ కసరత్తు


Sat,June 15, 2019 01:47 AM

dhawan
నాటింగ్‌హామ్: గాయం నుంచి కోలుకునేందుకు భారత స్టార్ ఓపెనర్ శిఖర్ ధవన్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాడు. ఎప్పుడెప్పుడు జట్టులోకి తిరిగి రావాలని చూస్తున్న గబ్బర్ అందుకు తగ్గట్లు ముందుకెళుతున్నాడు. ఆస్ట్రేలియాతో గత మ్యాచ్‌లో చేతి బొటన వేలి గాయానికి గురైన ధవన్..శుక్రవా రం జిమ్‌లో చెమటోడ్చాడు. గాయా న్ని లెక్కచేయకుండా లోయర్ బాడీ ఎక్సర్‌సైజ్‌లతో గడిపాడు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఇలాంటి పరిస్థితులు పీడకలలైనా..అవకాశాలను అందిపుచ్చుకుం టూ తిరిగి పుంజుకోవాల్సిందే అని ట్వీట్ చేశాడు. గాయం నుంచి త్వరలో కోలుకోవాలంటూ సందేశాలు పంపిన అభిమానులందరికి కృతజ్ఞతలు తెలిపాడు. మూడు మ్యాచ్‌లకు దూరమైన ఈ డాషింగ్ బ్యాట్స్‌మన్ గాయంపై టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ వచ్చే వారంలో నిర్ణ యం తీసుకోనుంది. ముందస్తుగా ధవన్ బ్యాకప్‌గా వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌ను ఇంగ్లండ్‌కు రప్పించిన సంగతి తెలిసిందే.

774

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles