ధవన్ ది బెస్ట్


Sun,April 14, 2019 02:48 AM

ganguly
కోల్‌కతా: ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ ధవన్‌పై జట్టు సలహాదారు గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచ అత్యుత్తమ ఓపెనర్లలో ధవన్ ఒకడంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. శుక్రవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో అజేయ అర్ధసెంచరీతో ధవన్ ఆకట్టుకున్నాడు. కోల్‌కతాతో మ్యాచ్ ముగిసిన తర్వాత గంగూలీ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌ను ధవన్ వీడుతున్నాడన్న వార్త తెలిసిన తర్వాత బాగా అనిపించింది. ఎందుకంటే ధవన్ లాంటి దూకుడుగా ఆడే క్రికెటర్ ఉంటే ఏ జట్టుకైనా లాభమే. ఈ సీజన్ లీగ్ తొలి దశలో కొద్దిగా తడబడ్డా..కోల్‌కతాతో మ్యాచ్ ద్వారా అతను టచ్‌లోకి వచ్చాడు. ఒక్కసారి అతను ఫామ్‌లోకొస్తే... ప్రత్యర్థి నుంచి విజయాన్ని లాగేసుకుంటాడు. ఐపీఎల్ వరకు పరిమితం గాకుండా భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో ధవన్ నిలకడగా రాణిస్తూ వస్తున్నాడు అని గంగూలీ అన్నాడు.

337

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles